AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జేపీ నడ్డా, అమిత్ షా‌తో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ భేటీ

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు సంబంధించి పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. గెలుపు గుర్రాల కోసం క్షేత్రస్థాయి నుంచి నివేదికల ఆధారంగా తుది జాబితా ఖరారుపై దృష్టిపెడుతున్నారు. లోక్ సభ అభ్యర్థుల జాబితాపై బీజేపీ జోరును పెంచేసింది.

ఈ నేపథ్యంలోనే శనివారం (ఫిబ్రవరి 24న) ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నివాసంలో జేపీ నడ్డా, అమిత్ షా‌తో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ సహా ఇతర కీలక నేతలు హాజరయ్యారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై జేపీ నడ్డాతో సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై చర్చ :
రాష్ట్రాల వారిగా అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై రాష్ట్ర నాయకత్వంతో బీజేపీ జాతీయ నాయకత్వం చర్చలు జరిపింది. ఇందులో ప్రధానంగా యూపీ, కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, చత్తీస్ గడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోక్‌సభ అభ్యర్థులపై కసరత్తు గురించి కూడా చర్చకు వచ్చింది. తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై చర్చ కూడా జరిగింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10