కొంతకాలంగా నడుస్తున్న ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈరోజు (అక్టోబర్ 16న) నాంపల్లి కోర్టు విచారణ చేపట్టాల్సి ఉండగా.. విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.
విచారణ చేపట్టాల్సిన న్యాయమూర్తి సెలవులో ఉండటంతో.. కేసును కోర్టు వాయిదా వేసింది. అయితే.. రోజు జరిగే విచారణకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా.. ఆయన ఇతర పనుల రీత్యా హాజరుకాలేదు. మరోవైపు.. జడ్జి కూడా లేకపోవటంతో.. విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేశారు. దీంతో.. మరో నెల రోజుల పాటు రేవంత్ రెడ్డికి భారీ ఊరట దక్కింది.