AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోదీ తుక్డే గ్యాంగ్ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్

ప్రజాస్వామ్య మనుగడకోసం ప్రశ్నించేవారిని దేశద్రోహులుగా, అర్బన్ నక్సల్స్ గా బీజేపీ ముద్రిస్తున్నదని..ప్రధాని నోటి వెంట తుక్డే గ్యాంగ్ అనే వ్యాఖ్యలు తీవ్ర విచారకరం అన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవి ప్రధాని స్థాయిలో మాట్లాడే మాటలు కావు. ఆయన స్థాయిని దిగజార్చే మాటలు అని భట్టి విక్రమార్క ప్రధాని మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం భట్టి విక్రమార్క ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ప్రధాని మోదీ మహారాష్ట్రలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీని నడిపిస్తోంది అర్బన్ నక్సల్స్ అని.. తుక్డే తుక్డే గ్యాంగ్ అంటూ పరుష పదజాలంతో కామెంట్స్ చేశారు. అయితే అందుకు తెలంగాణ మంత్రి భట్టి విక్రమార్క స్ట్రాంగ్ గా మోదీకి కౌంటర్ ఇచ్చారు. దేశం కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టిన కుటుంబ నేపథ్యం కలిగిన పార్టీ చరిత్ర తమది అన్నారు. గాంధీ కుటుంబం అంటేనే త్యాగాలకు ప్రతీక అని అన్నారు.

మొదటినుంచి ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. ప్రధాని మోదీ విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యలు ఖండిస్తున్నానని భట్టి అన్నారు. దేశ సమగ్రత, సమైక్యతకు పాటుపడే పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం దేశ సమగ్రతను సర్వనాశనం చేస్తోంది బీజేపీయే అన్నారు. మోదీ అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణి, నియంతృత్వ విధానాలను ప్రశ్నిస్తున్న పాపానికి రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ తన జోడో యాత్ర ద్వారా ప్రజాస్వామిక విధానాలను ప్రజలకు తెలియజేశారన్నారు. మోదీ మత తత్వ విధానాన్నిప్రజలకు తెలిసొచ్చేలా చేశారని అన్నారు. మోదీ విధానాలను దేశ ప్రజలంతా గమనిస్తున్నారని.. ఇప్పటికైనా మోదీ విద్వేష పూరిత వ్యాఖ్యానాలు మానుకోవాలని భట్టి అన్నారు.

అమెరికా వెళ్లిన భట్టి

అమెరికా పర్యటన నిమిత్తం శనివారం వెళ్లారు. ఢిల్లీకి ఉదయం చేరుకుని అక్కడినుంచి యూఎస్ కు వెళ్లారు. అమెరికాలో జరుగుతున్న గ్రీన్ పవర్ రంగాలలో అత్యాధునిక పద్దతులను స్టడీ చేయనుంది డిప్యూటీ సీఎం భట్టి ఆయన అధికార బృందం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామిక వేత్తలను సైతం కలవనున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10