AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బలగం మొగిలయ్య కన్నుమూత.. టాలీవుడ్‌లో తీవ్ర విషాదం

పలువురు ప్రముఖుల సంతాపం

బలగం సినిమా గాయకుడు బలగం మొగిలయ్య కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. బలగం సినిమా గ్రామీణ నేపథ్యం పాటలతో మొగిలయ్య ఆకట్టుకున్నారు. మొగిలయ్య స్వగ్రామం వరంగల్‌ జిల్లా, దుగ్గొండి గ్రామం. గతంలో మొగిలయ్య అనారోగ్యంపై ప్రభుత్వం స్పందించి చికిత్స అందించింది. కిడ్నీలు ఫెయిల్‌ కావడంతో రోజూ డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు. మొగిలయ్య మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. మొగిలయ్య మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

ఇండస్ట్రీని షేక్‌ చేసిన ‘బలగం’..

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో కమెడియన్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్‌ చేసింది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మర్చిపోయిన మానవ సంబంధాలను ఈ సినిమా ద్వారా వేణు అద్భుతంగా చూపించడంతో బలగం సినిమా అందరినీ ఆకట్టుకుంది.

పాటతో పాపులర్‌..
బలగం చిత్రంలో ‘తోడుగా మాతోడుండి నీడగా మాతో నడిచి.. నువ్వెక్కడికెళ్లినావు కొమురయ్యా’ పాటతో రెండు తెలుగు రాష్ట్రాలోను పాపులర్‌ అయ్యారు. మొగిలయ్యకు ఈ పాత్ర మంచి గుర్తింపు తెచ్చింది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా బారిన పడటం, ఇతర అనారోగ్య కారణాలతో మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. పేదింటికి చెందిన మొగిలియ్యను బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకున్నాయి. మొగిలయ్యకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యం క్షీణించడంతో గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. మొగిలయ్య మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10