AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాట ఉన్నన్ని రోజులు గద్దర్‌ సజీవం.. మాజీ మంత్రి హరీశ్‌రావు

గద్దర్‌ లేని ఉద్యమం లేదని, ఆయన ఆర్ధ శతాబ్దపు పోరాటయోధుడని, పాట ఉన్నంత కాలం గద్దర్‌ సజీవంగా ఉంటారని మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో గద్దర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌.. ప్రజా యుద్ధనౌక గద్దరన్న’ సాహిత్య పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, కవి, గాయకుడు నందిని సిధారెడ్డి, గద్దర్‌ కుమారుడు సూర్యతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పదవులకోసం ఆశ పడకుండా తన తం డ్రి పోరాటాన్ని, చరిత్రను రేపటి భావితరానికి అందించేందుకు సూర్యం మంచి ప్రయత్నం చేశారని అభినందించారు. ఐదు దశాబ్దాల్లో జరిగిన ప్రతి పోరాటంలో గద్దర్‌ ఉన్నాడని, విప్లవోద్యమం, తెలంగాణ ఉద్యమం, దళిత ఉద్యమం ఇలా ప్రతి దాంట్లో న్యాయం వైపున నిలిచి అన్యాయాన్ని ప్రశ్నించాడని, మలిదశ ఉద్యమంలో గద్దర్‌ అన్నను కలిసే అదృష్టం కలిగిందని తెలిపారు. గద్దర్‌ ఒక్క పాట 100 ఉపన్యాసాల సారాంశమని, చాలా సామాన్య పదాలతో ప్రజల హృదయాల్లోకి చేరేలా ఆయన పాటలు పాడేవారని గుర్తుచేశారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ‘పొడుస్తున్న పొద్దుమీద’ పాట తెలంగాణ ఉద్యమాన్ని, సమాజాన్ని ఉర్రూతలూగించి ప్రజల్లో చైతన్యం తెచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్‌కు గద్దర్‌ అండగా నిలిచారని గుర్తుచేశారు.

గద్దర్‌ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలి

తూఫ్రాన్‌ మాటిక చెరువులో నీళ్లులేవని, హల్దీ వాగులోంచి మాటిక చెరువులోని నీటిని లిఫ్ట్‌ చే యాలని గద్దర్‌ కోరితే 8 నెలల్లో పూర్తి చేసి ఆయనతోనే ప్రారంభింపజేశామని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ వచ్చాక జీహెచ్‌ఎంసీ మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని గద్దర్‌ లెటర్‌ రాస్తే వెంటనే ఒక సంతకంతో కేసీఆర్‌ జీతాలు పెంచారని, అది గద్దర్‌కు కేసీఆర్‌ ఇచ్చి న గౌరవమని తెలిపారు. ‘సిద్దిపేటలో గద్దర్‌ విగ్ర హం పెట్టడం మాకు చాలా గౌరవం.. దాన్ని ఏర్పా టు చేయించే బాధ్యత నాది’ అని చెప్పారు. గద్దర్‌ జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ చేయాలని అందు కు తాను సహకరిస్తానన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10