AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎంపీ ఎన్నికల వేళ.. దానం నాగేందర్‌పై హైకోర్టులో మరో పిటిషన్‌..

పార్లమెంట్ ఎన్నికల వేళ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు షాక్ తగిలేలా ఉంది. దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ నగరానికి చెందిన రాజు యాదవ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలుపొందిన దానం నాగేందర్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరటంతో పాటు ఆ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారని చెప్పారు.

ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ మేరకు దానంపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. కాగా ఈ పిటిషన్ నేడు
(మార్చి 28) విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది.

కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రెండు వారాల క్రితం కారు పార్టీకి షాక్ ఇస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన రెండ్రోజులకే దానం నాగేందర్‌ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేస్తుండగా.. బలమైన అభ్యర్థిని దింపాలనే యోచనలో బీసీ సామాజిక వర్గానికి చెందిన దానంను కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10