టీడీపీ, జనసేన , బీజేపీ నేతలే లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. పోస్టులు పెట్టిన సినీ నటి శ్రీ రెడ్డిపై గుంటూరు లో కేసు నమోదైంది. మాజీ కార్పొరేటర్ దాసరి జ్యోతి.. శ్రీ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడిన శ్రీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో నగర పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.
మరోవైపు..
అలాగే హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లాలో కేసు నమోదు అయ్యింది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలపై శ్రీరెడ్డి తప్పుడు ప్రచారం చేశారంటూ టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని పద్మ ఆరోపించారు. తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని టీడీపీ మహిళా నేత పద్మ డిమాండ్ చేశారు.