AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్‌పై మరో కేసు.. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మరో కేసు నమోదైంది. తాజాగా కేటీఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈకార్ రేసు కేసులో హైకోర్టులో కేటీఆర్‌కు కాస్త ఊరట లభించినప్పటికీ, తాజాగా మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసింది ఈడీ. ఏ1గా కేటీఆర్‌ పేరు చేర్చిన ఈడీ, ఏ2గా అప్పటి మున్సిపల్ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్, ఏ3గా HMDA అధికారి BLN రెడ్డి పై కేసులు నమోదు చేసింది. తెలంగాణ ఏసీబీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఈడీ పేర్కొంది.

ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ ఏసీబీకి లేఖ రాశారు ED అధికారులు. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని కోరారు. ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు HMDA అకౌంట్‌ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వంటి వివరాలు ఇవ్వాలంటూ ED కోరింది. ప్రస్తుత HMDA కమిషనర్ దాన కిశోర్‌ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని ED కోరింది. ఏయే తేదీల్లో లావాదేవీలు జరిగాయో ఆ వివరాలు కూడా చెప్పాలని ఈ లేఖలో ED కోరింది. ఈ క్రమంలో ఈడీ కేసు నమోదు చేసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10