AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వేణు స్వామికి మరో బిగ్‌ షాక్‌.. మహిళా కమిషన్‌ నోటీసులు..

14న విచారణకు రావాల్సిందేనంటూ ఆదేశం

జ్యోతిష్యుడు వేణు స్వామికి మరోసారి షాక్‌ తగిలింది. మహిళా కమిషన్‌ రెండో సారి నోటీసులు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు మహిళా కమిషన్‌ మరోసారి నోటీస్‌ జారీ చేసింది. ఈ నెల 14వ తేదీన కమిషన్‌ ముందు హాజరవ్వాలని నోటీసులో పేర్కొంది. మొదటి నోటీసుకు హాజరవ్వకుండా వేణు స్వామి కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించింది. అయితే, తాజాగా గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేయడంతో మహిళా కమిషన్‌ మరోసారి నోటీసులు జారీ చేసింది.

స్వామిపై ఆగ్రహం..
నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితం త్వరలోనే ముగుస్తుంది అని వేణు స్వామి జ్యోషం చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పిన జ్యోషంపై అక్కినేని అభిమానులతో పాటు, మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియాలో సైతం పెద్ద ఎత్తున డిమాండ్స్‌ వచ్చాయి. గతంలో మహిళ జర్నలిస్టులు సైతం ఊమెన్‌ కమిషన్‌ కు వేణు స్వామిపై ఫిర్యాదు చేశారు.

ఆది నుంచి వివాదాలే..
సెలబ్రేటీల జీవితాల గురించి జ్యోతిష్యం చెబుతూ వేణుస్వామి విమర్శల పాలయ్యారు. గతంలో అక్కినేని హీరో నాగ చైతన్య, స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రేమ పెళ్లి చేసుకున్న విడిపోతారని ఆయన జ్యోతిష్యం చెప్పాడు. అయితే, కారణాలు ఏవైనా ఆయన చెప్పినట్లుగానే నాగ చైతన్య, సమంత విడిపోయారు. ఇటీవల నాగ చైతన్య శోభిత దూళిపాళ్లతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నా వీడిపోతారని వేణుస్వామి జాతకం చెప్పాడు. దీంతో వేణుస్వామి మరోసారి వివాదంలో పడ్డారు. ఇలా సెలబ్రేటీల జీవితాల గురించి జాతకం చెబుతూ వేణుస్వామి నిత్యం వివాదంలో పడుతుంటారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10