ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహం భవనం పై నుంకి దూకి ఓవిద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా(Sangareddy Dist) నారాయఖేడ్‌లోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం(Inter student) చదువుతున్న మాధవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన హాస్టల్ సిబ్బంది గాయపడిన మాధవిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.