ఉపాధి హామీ పనులు చేస్తుండగా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సుమారు వందకు పైగా కూలీలు గాయపడ్డారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని బూరుకుంట్లలో 280 మంది కూలీలు ఉపాధి హామి పనికి వెళ్లారు.పనులు చేస్తుండగా కూలీలపైన ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇనుగంటి దేవానందం అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరో వందమంది వరకు గాయపడ్డారు.మరో మహిళకు తేలుకాటు వేయడంతో పాటు, ఓ వ్యక్తి కాలుపై గడ్డపార పడి గాయలయ్యాయి.వీరందరిని కొడిమ్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఒకే రోజు ఒకే చోట వందిమంది వరకు గాయపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.