కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్ట్ లో చిక్కుకున్న సంఘటన బోయిన్ పల్లిలోని వీఆర్ హాస్పిటల్ లో ఆదివారం జరిగింది. ఆదివారం బోయిన్ పల్లిలోని వీఆర్ హాస్పిటల్ ఏడవ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎమ్మెల్యే లిఫ్ట్ లో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు పరిమితికి మించి ఎక్కడంతో లిఫ్ట్ స్ట్రక్ అయి ఆగిపోయింది. లిఫ్ట్ డోర్స్ తెరుచుకోకపోవడంతో వెంటనే స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం లిఫ్ట్ డోర్లను పగల కొట్టడంతో ఎమ్మెల్యేతో పాటు అందరూ బయటకు వచ్చారు. ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆసుపత్రి యాజమాన్యాన్ని వివరణ కోరగా ఓవర్ లోడ్ అవ్వడంతోనే ఇలా జరిగిందని తెలిపారు.