AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీలోకి పొంగులేటి, జూపల్లి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో బీజేపీ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. ఈ భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకులు తమ నివాసానికి వచ్చారని పొంగులేటి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని అనుకున్నాం కానీ.. సీఎం కేసీఆర్ దాన్ని తుంగలో తొక్కేశారని అన్నారు.బీజేపీ చేరీకల కమిటీ వారు తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని.. గతంలో, ఇప్పుడు ఢిల్లీ పెద్దలు పార్టీలోకి ఆహ్వానించారని పొంగులేటి చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసమే బీఆర్ఎస్ ను వీడామని.. ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు తాము తీసుకునే నిర్ణయాలు కట్టుబడి ఉంటాయని తెలిపారు.

సీఎం కేసీఆర్ ను మూడవ సారి అధికారం చేపట్టకుండా చేయడమే తమ లక్ష్యమని.. సీఎం కేసీఆర్ ను గద్దె దించే శక్తి ఉన్న పార్టీకే మద్దతు ఇస్తామని తెలిపారు. యావత్ తెలంగాణ బిడ్డల ఆలోచనలకు అనుకూలమైన పార్టీలో చేరుతామని చెప్పారు.సీఎం కేసీఆర్ ఖమ్మం నియోజకవర్గం నుండి పోటీ చేస్తే.. ఆయనపై పోటీకి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కేసీఆర్ ను గద్దె దించడమే తమ ఎజెండా అని.. అందుకోసం తాము ఏ నిర్ణయమైనా తీసుకుంటామని పొంగులేటి చెప్పారు.

ఇక బీజేపీ ప్రస్తావించిన అంశాలను తాము పరిశీలిస్తున్నామని.. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని జూపల్లి తెలిపారు. మరొకసారి అధికారం చేపట్టే అర్హత బీఆర్ఎస్ కు లేదని తెలిపారు.రాష్ట్రంలో ఉద్యమకారులు, సబ్బండ వర్ణాల వారిని సంఘటితం చేసి.. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడతామని స్పష్టం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10