స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ టికెట్ నాదే.. గెలుపు నాదే అంటూ కామెంట్స్ చేశారు. తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ కేటాయింపులపై మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. మీడియా కథనాలు చూసి భయపడవద్దని, అయోమయానికి గురికావద్దని కార్యకర్తలకు సూచించారు. పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, కేసీఆర్ కు వీరవిధేయుడిగా ఉన్నానని తెలిపారు. పని చేసుకుంటూ పోతే.. అధిష్టానం గుర్తిస్తుందని చెప్పారు. టికెట్ విషయంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. కట్టుబడి ఉంటానన్నారు. అదేవిధంగా రేపటి మంత్రి కేటీఆర్ పర్యటన, బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.