గిగ్ వర్కర్లకు రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం గిగ్ వర్కర్లతో సమావేశమయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్, ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లతో సీఎం సమావేశమయ్యారు. సమావేశం అనంతరం… గిగ్ వర్కర్లకు పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ వర్తింప చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, ప్రమాదబీమా వర్తింప చేస్తామని తెలిపారు. అలాగే రూ.5 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.