కేంద్ర మంత్రి అమిత్ షా బుధవారం రాత్రి హైదరాబాద్ కు రానున్నారు. రేపు రాత్రి 10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం హైదరాబాద్‌లో ముఖ్య నేతలతో అమిషా సమావేశం కానున్నారు. అనంతరం భద్రాచలంకు బయలు దేరనున్నారు. రాష్ట్ర బీజేపీలో విభేదాల మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఖమ్మంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ప్రస్తుతం అమిత్ షా పర్యటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
షెడ్యూల్ ప్రకారం ఖమ్మంలో బహిరంగ సభ అనంతరం షా హైదరాబాద్ చేరుకుంటారు. రాష్ట్ర శాఖలో ఇటీవలి అంశాలపై ఆయన చర్చించే అవకాశం ఉంది. ఖమ్మంలో పార్టీ బలహీనంగా ఉన్నందున, పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నందున అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు ఏ మాత్రం తిరుగులేని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వామపక్షాల ప్రభావం ఉన్న ప్రాంతంలో లక్ష మందిని సమీకరించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు అమిత్ షా టూర్‌కు ముందు ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మౌనం పాటిస్తున్నారు. దీంతో ఈటల రాజేందర్ మౌనం ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మను ఈటల కలిసొచ్చారంటూ ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఈటలకు బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిపై మీడియాకు లీకులు వచ్చాయి. లీకుల తర్వాత ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా సీనియర్ల మీటింగ్ నిర్వహించారు. దీంతో అప్పటినుంచి ఈటల మౌనం పాటిస్తున్నారు. అమిత్ షా పర్యటనకు ముందు ఈటల మౌనంపై బీజేపీలో జోరుగా చర్చ జరుగుతోంది.
ఒక్కరోజు ముందే హైదరాబాద్‌కు అమిత్‌షా?
కాగా.. కేంద్రమంత్రి అమిత్ షా రేపు (బుధవారం) రాత్రికే హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ఒక్కరోజు ముందే బీజేపీ అగ్రనేత రాష్ట్రానికి వస్తున్నట్లు సమాచారం. 15న ఖమ్మం జరుగనున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో అమిత్ షా టూర్‌పై ఆసక్తి నెలకొంది. అధ్యక్షుడి మార్పు, ప్రచార కమిటీ చైర్మన్ ఈటలకు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.