ఎటుచూసినా సమస్యలే..
మురికి కూపాలుగా కాలనీలు
కంపు మధ్యే జీవనం సాగిస్తున్న ప్రజలు
రామన్నకు ఈసారి ఓటేస్తే ఉన్న గుడిసె కూడా పీకేయిస్తారు
ఎమ్మెల్యేపై బీజేపీ రాష్ట్ర నాయకులు కంది ఫైర్
ఆదిలాబాద్: జోగు రామన్నకు మళ్లీ ఓటేస్తే ఉన్న గుడిసెలు కూడా పీకిపారేయిస్తారని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో పర్యటించారు. కాలనీలో కనీస మౌలిక సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న అవస్థలు చూసి చలించిపోయారు. మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అని ఎమ్మెల్యే జోగురామన్నను ప్రశ్నించారు. వార్డులన్నీ మురికి కూపంగా మారాయని, నిత్యం కంపు మధ్యే ప్రజలు జీవనం కొనసాగించాల్సి దుస్థితి నెలకొందని కంది మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతుకు ముందు కంది శ్రీనివాస రెడ్డి పట్టణం లోని కేఆర్కే కాలనీలో పర్యటించారు. ఆయన నుదుట తిలకం దిద్ది ఆహ్వానించారు కాలనీవాసులు. ఉదయం దాదాపు రెండున్నర గంటలపాటు కాలనీలోని ఇల్లిల్లూ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చాలా మంది కాలనీ వాసులు కంది శ్రీనివాసరెడ్డి ఎదుట సమస్యలు చెప్పుకున్నారు.
కాలనీలోని అనేక మందికి వృద్ధాప్య, వితంతు ఫించన్లు రావడం లేదని తెలుసుకొని ఎమ్మెల్యే జోగు రామన్న పై ఆగ్రహం వ్యక్తం చేసారు. 14 యేండ్లు ఎమ్మెల్యేగా ఉన్న జోగు రామన్న అభివృద్ధి చేసిందేమీ లేదని మండిపడ్డారు. నమ్మి ఓటేసి గెలిపిస్తే ఇదేనా నువు చేసిన అభివృద్ధి అని ప్రశ్నించారు.
14 ఏళ్లకు పైగా కాలనీలో నివాస ముంటున్న ప్రజలకు కనీస మౌలిక వసతులు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేసారు. కనీసం రోడ్డు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం లేదని ఎమ్మెల్యేగా ఉన్న జోగురామన్న ఏం చేస్తున్నారని మండిపడ్డారు. కేఆర్కే కాలనీ మురికి కూపంగా తయారైందన్నారు.పందులతో సావాసం చేస్తున్నారని అన్నారు. వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
సంవత్సరం పైగా తిరుగుతున్న షాదీ ముబారక్ చెక్కు ఇవ్వడంలేదని ఓ మాతృమూర్తి కంది శ్రీనివాస రెడ్డి దృష్టికి తెచ్చింది. ఇందుకు కంది శ్రీనన్న స్పందిస్తూ.. జోగురామన్న వీళ్లంతా నీకు ఓటేసి గెలిపిస్తే ప్రభుత్వమిస్తున్న ఫలాలు కూడా వీరికి అందకుండా చేస్తున్నారా.. ఇది న్యాయమా అని ప్రశ్నించారు. ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తే వచ్చేఎన్నికల్లో నీకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
చదువుకున్న యువతకు ఉద్యాగాలు లేవని వారికి ఉపాధి చూపాల్సిన జోగు రామన్న మొద్దు నిద్ర పోతున్నాడని ఎద్దేవా చేసారు. పేదలకు ఉద్యోగాలివ్వక రిమ్స్ అవుట్ సోర్సింగ్ లో జోగు వారి కుటంబం లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకున్నరని మండి పడ్డారు.
దాదాపు రెండున్నర గంటలపాటు కాలనీలోని ప్రతీ గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే బాధ్యతను గుర్తు చేసారు.