సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే ఎన్టీఆర్.. ఈ రోజు (మార్చి 26) తన భార్య ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ ఓ ఫొటో షేర్ చేశారు. ఈ మేరకు ఆయన చేసిన ట్యాగ్ లైన్ నందమూరి అభిమానులను ఫిదా చేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ కొట్టేసిన ఎన్టీఆర్.. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలపై చాలా రేర్ గా రియాక్ట్ అవుతుంటారు. సందర్భం వస్తే గాని.. ఫ్యామిలీ ఫొటోస్, కుటుంబ సంగతులు బయటపెట్టరు. అలాంటి యంగ్ టైగర్ తాజాగా తన భార్యను ముద్దు పేరుతో పిలుస్తూ ఓ పోస్ట్ పెట్టారు.
2011లో లక్ష్మి ప్రణతిని పెళ్లి చేసుకున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. వారి పేర్లు భార్గవ్ రామ్, అభయ్ రామ్. ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి ఫ్యామిలీ లైఫ్ లో పిల్లల బాధ్యతలు చూసుకుంటోంది. ఎప్పుడో ఒక్కసారి తప్పితే పెద్దగా సోషల్ మీడియాలో కనిపించదు ప్రణతి.