ముహూర్తం ఖరారు చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభానికి మరో ముహూర్తం ఫిక్స్ అయింది. పలుమార్లు కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడిన విషయం విదితమే. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా ప్రారంభించాలని తొలుత భావించారు. కానీ పనులు పూర్తికాకపోవడం వల్ల వాయిదా పడిరది. గత నెలలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రారంభోత్సవం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో చివరి నిమిషంలో వాయిదా వేశారు.
ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున సచివాలయం ఆవరణలో దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే జూన్ 2న అమరవీరుల స్థూపాన్ని కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తోంది. గత నెలలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సచివాలయాన్ని ప్రారంభించాలని భావించారు. కానీ సడెన్‌గా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు కొత్త సచివాలయం ప్రారంభోత్సవాన్ని ఏప్రిల్ 30 చేపట్టాలని నిర్ణయించారు. కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెడుతూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. శుక్రవారం కొత్త సెక్రటేరియట్ పనులను కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కేసీఆర్ సెక్రటేరియట్‌ను పరిశీలించిన కొద్దిసేపటికే ప్రారంభోత్సవానికి సంబంధించిన డేట్‌ను ప్రభుత్వం ప్రకటించింది.