హైదరాబాద్: నగరం నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ముందు బౌద్ధ మత ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశ్ అంబేడ్కర్, బౌద్ధ గురువులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి కేసీఆర్, ముఖ్యనేతలు నివాళులర్పించారు. అంబేడ్కర్ జీవిత విశేషాల ఫొటో ఎగ్జిబిషన్ కెసిఆర్, ప్రకాశ్ తిలకించారు. అంబేడ్కర్ విగ్రహ రూపకల్పనపై డాక్యుమెంటరీ ప్రదర్శించారు. మనవడు ప్రకాశ్ తో కలిసి కెసిఆర్, పలువురు ముఖ్యనేతలు తిలకించారు.