AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపు నిరుద్యోగ మిలియన్‌ మార్చ్‌

టీఎ్‌సపీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై బీజేపీ హైదరాబాదులో నిరుద్యోగ మిలియన్‌ మార్చ్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ ఉద్యమంలో మిలియన్‌ మార్చ్‌ కీలక ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయిన నేపథ్యంలో ఆ స్థాయిలో జూన్‌లో నిరుద్యోగులకు మద్దతుగా ఈ భారీ ఆందోళన నిర్వహించాలని భావిస్తోంది. తద్వారా యువతకు, బాధిత కుటుంబాలకు మరింత చేరువ కావాలని యోచిస్తోంది. టీఎ్‌సపీఎస్సీ పేపర్ల లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారంటూ బీజేపీ ఇప్పటికే ఆందోళనలు చేపట్టింది. ఐటీ మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలని, హైకోర్టు సిటింగ్‌ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని, నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. శనివారం వరంగల్‌లో నిరుద్యోగ మార్చ్‌ నిర్వహించనుంది. అనంతరం ప్రతి ఐదారు రోజులకు ఒక ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఈ మార్చ్‌లు నిర్వహిస్తామని, పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వీటిని మే నెలాఖరు వరకు ముగిస్తామని, తర్వాత హైదరాబాదులో భారీస్థాయిలో మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని బీజేపీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. వరంగల్‌ మార్చ్‌ తర్వాత రెండో నిరుద్యోగ మార్చ్‌ను మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్నట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రకటించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10