అమెరికాలోని టెక్సాస్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ భారీ ప్రమాదంలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18వేల ఆవులు మృత్యువాత పడడం తీవ్ర విషాదం నింపింది. టెక్సాస్ లోని సౌత్ ఫోర్క్ డెయిరీ ఫాంలో హఠాత్తుగా భారీ పేలుడు సంభవించి ఈ విషాదం అలుముకుంది.
అందులో పనిచేస్తున్న ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన ఆవుల విలువ ఏకంగా 36 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా.. డెయిరీ ఫాంలోని యంత్రాలు బాగా వేడెక్కడం వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పేలుడు జరిగిన తర్వాత ఒక్కసారిగా మీథేన్ అధికమొత్తంలో విడుదలైందని.. అందుకే ఆవులు మృతిచెంది ఉంటాయని చెబుతున్నారు. అయితే ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉంది.