హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం కురిసింది. పంజాగుట్ట, అమీర్ పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోఠి, ఎల్బీనగర్, చంపాపేట్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, మీర్ పేట, బేగంపేట, ట్యాంక్ బండ్, గోల్కొండ, మల్లేపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, మెహిదీపట్నం, కార్వాన్, లంగర్‌హౌస్, చార్మినార్, అత్తాపూర్, బండ్లగూడలో వర్షం కురుస్తుంది. పలుప్రాంతాల్లో శుక్రవారం ఉదయం చిరుజల్లులు కురుస్తున్నాయి.ఈదురుగాలుతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.