AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలపడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రోత్సహాన్ని అందిస్తోదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం సికింద్రాబాద్ లోని రైల్వే కళారంగ్ వేదిక ద్వారా.. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 248 మంది యువతీ యువకులకు నియామకపత్రాను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా.. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి రిఫరెన్సులు, రికమండేషన్లకు తావులేకుండా కేవలం మెరిట్ ద్వారానే ఉద్యోగాలు ఇస్తోందన్నారు. భారత యువత శక్తి సామర్థ్యాలపై ప్రధాని మోదీకి విశ్వాసం ఉందన్న కేంద్రమంత్రి..అనుసంధానత, మౌలికవసతుల కల్పన, విద్య, వైద్యం, ఫార్మా, రక్షణ, సాంకేతికత ఇలా ప్రతి రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం.. ప్రారంభంలో 10 లక్షల మందికి ఏడాదిలోపు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని అనుకున్నప్పటికీ.. ఈ సంఖ్య 12 లక్షలకు పెరిగిందన్నారు. వారందరికీ నిర్దేశిత సమయంలో ఉద్యోగాలు అందజేసే దిశగా మోదీ సర్కారు పనిచేస్తోందన్నారు. విద్యతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసేలా, సృజనాత్మకత, పరిశోధన, సాంకేతికతను చిన్నతనం నుంచే ప్రోత్సహించేలా.. నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకొచ్చిన విషయాన్ని కేంద్రమంత్రి వెల్లడించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగుమెంటెడ్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సాంకేతికతకు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.

2014లో భారతదేశంలో 5.8 కోట్ల మొబైల్ ఫోన్లు మాత్రమే దేశంలో ఉత్పత్తి అయ్యేవని.. ఇప్పుడా సంఖ్య 31 కోట్లకు పెరిగి.. రూ.2,75,000 కోట్ల విలువైన మొబైల్స్ దేశంలో ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. విదేశాలకు కూడా మన దగ్గర తయారైన మొబైల్స్ పెద్దమొత్తంలో ఎగుమతి అవుతున్నాయన్నారు.పారదర్శక విధానంతో దేశంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని, ఇందుకోసం భారతీయులంతా ఐకమత్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, అడిషనల్ జనరల్ మేనేజర్ ధనుంజయులు, డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్త, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10