మహబూబాబాద్ జిల్లాలో మరోసారి ప్రభుత్వ పాఠశాలలో సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం ఆలస్యంగా బయటపడింది. కస్తూర్భ పాఠశాలలో పుడ్ పాయిజన్(Food poisoning)కావడంతో 43మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి నుంచే విద్యార్ధినులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అయితే ఈ విషయాన్ని బయటకుపొక్కనివ్వకుండా డాక్టర్లనే కస్తుర్బా పాఠశాలకు పిలిపించి రహస్యంగా వైద్యం చేయడంతో అసలు విషయం బయటకువచ్చింది.
సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్ధినుల ప్రాణాల్లో గాల్లో దీపాల్లా మారుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తుర్బా పాఠశాలలో బుధవారం రాత్రి నుంచి 43మంది విద్యార్ధినులు అస్వస్తతకు గురయ్యారు. కడుపు నొప్పి, ఇతర సమస్యలో బాధపడుతుంటే పాఠశాలలో సిబ్బంది, అధికారులు పట్టించుకోలేదు. దీంతో వారి పరిస్థితి మరింత విషమంగా మారినట్లుగా తెలుస్తోంది. అయితే గత రాత్రి నుంచి విద్యార్ధినులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉండటంతో వైద్యులను కస్తూర్బా పాఠశాలకు పిలిపించి ..ట్రీట్మెంట్ ఇప్పించారు. విషయం బయటకు రానివ్వకుండా ప్రయత్నించారు.