సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గాంధీభవన్ వేదికగా భూ కుంభకోణంపై రేవంత్ కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక భూములపై కేసీఆర్ కుటుంబం కన్నుపడిందని..కావాల్సిన వారికి భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు.యశోధ ఆస్పత్రికి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం భూములు కట్టబెట్టిందని..యశోద యాజమాన్యం 800 కోట్లు కొల్లగొట్టిందని తెలిపారు.యశోధ,కేసీఆర్ కు సంబందించిన బంధువులు అలెగ్జండ్రియా ఫార్మామీద ఒత్తిడి తెచ్చారని,విలువైన 15ఎకరాల భూమిని పార్థసారథి రెడ్డి కట్టబెట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు.కల్వకుంట్ల జగన్నాథరావు భూమిని గుంజుకున్నారని..జగన్నాథరావుకు కల్వకుంట్ల అనే అర్హత ఉందని,అంతకుమించి ఏ అర్హత లేదని విమర్శించారు.80 వేలకు గజం భూమిని అమ్మాలని అధికారులు ఆదేశాలిచ్చారని చెప్పారు.భూములను కొల్లగొట్టడం ద్వారా కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని..ప్రభుత్వానికి తీవ్ర ఆస్థి నష్టం వాటిల్లిందని తెలిపారు.వెనకేసుకున్న అక్రమ సంపదతో.. దేశాన్ని శాసించాలనకుంటున్నారని ఫైర్ అయ్యారు.