ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు రాజీనామాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి గాలి వీస్తుంది.మా నాయకుడి వెంటే మేము అంటూ.. వరుస రాజీనామాలకు సిద్ధమవుతున్నారు గులాబీ శ్రేణులు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో పలువురు బీఆర్ఎస్ కు రాజీనామా చేసారు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటే తమ ప్రయాణమని వారు స్పష్టం చేసారు.బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పార్టీని బలోపేతం చేసిన వారికి సరైన గుర్తింపు రావడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేసారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్లినా.. ఆయన వెంటే నడుస్తామని వారు పేర్కొన్నారు.