AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష పడాల్సిందే

హైదరాబాద్: లిక్కర్ స్కామ్‌లో ఎంఎల్‌సి కవితపై ఆరోపణలు వచ్చాయని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. దర్యాప్తు సంస్థలకు కవిత సహకరించాలని డిమాండ్ చేశారు. కవితకు నోటీసులు వస్తే తెలంగాణకు జరిగిన అవమానంగా ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు ఏమైనా ఢిల్లీకి వెళ్లి లిక్కర్ స్కామ్‌కు పాల్పడ్డారా? అని ప్రశ్నించారు. కవితను ఇడి పిలిస్తే తెలంగాణ ప్రజలకు ఆపాదించవద్దని మండిపడ్డారు. తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష పడాల్సిందేనన్నారు. ఇడి నోటీసులు కవిత, బిఆర్‌ఎస్‌కు మాత్రమే సంబంధం ఉందని భట్టి చెప్పారు. లిక్కర్ స్కామ్‌లో ఎంఎల్‌సి కవితకు ఇడి నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10