ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు బీఆర్‌ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. మొన్న నలుగురు ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలవగా తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత శనివారం సచివాలయంలో రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమయంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. తీగల కృష్ణారెడ్డి టీడీపీ నుంచి హైదరాబాద్ మేయర్‌గా పని చేశారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి మహేశ్వరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బీఆర్‌ఎస్ నాయకులు వరుసగా రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో హస్తం గూటికి చేరుతారన్న చర్చ జరుగుతోంది.