నేపాల్‌లోని దంగ్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఓ ప్రయివేటు బస్సు నేపాల్‌గంజ్‌లోని బంకే నుంచి ఖాట్మండుకు ప్రయాణికులతో బయల్దేరింది. రాప్తి నది మీదుగా వెళ్తున్న సమయంలో బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎనిమిది మందిని గుర్తించామని, మరో నలుగురి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ ప్రమాదంలో మరో 22 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరు భారతీయుల్లో ఒకరు యూపీకి చెందిన మునే(31), బీహార్‌కు చెందిన యోగేంద్ర రామ్(67) ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను లమాహి ఆస్పత్రికి తరలించారు.