AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భార‌త్ జోడో న్యాయ్‌ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మ‌ణిపూర్‌లో ప్రారంభంకానున్న భార‌త్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన‌నున్నారు. రేప‌టి నుంచి రాహుల్ గాంధీ న్యాయ్‌ యాత్ర‌ను చేప‌ట్ట‌నున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉద‌యం సీఎం రేవంత్‌రెడ్డి.. మ‌ణిపూర్‌కు వెళ్ల‌నున్నారు. తొలి రోజు న్యాయ యాత్ర‌లో పాల్గొన్న త‌ర్వాత ఆయ‌న ఢిల్లీకి తిరిగి వ‌స్తారు. ఆ త‌ర్వాత దావోస్‌లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సుకు వెళ్తార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీని రాహుల్ క‌లుసుకోనున్నారు. రెండు ఎమ్మెల్సీ సీట్ల నామినేష‌న్ల గురించి ఆయ‌న చ‌ర్చిస్తారు. సీఎం రేవంత్‌తో పాటు దావోస్‌కు ఐటీ మంత్రి డీ శ్రీధ‌ర్ బాబు కూడా వెళ్తున్నారు. మ‌ణిపూర్ రాజ‌ధాని ఇంపాల్ నుంచి కాకుండా.. తౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేటు స్థ‌లం నుంచి రాహుల్ న్యాయ యాత్ర ప్రారంభంకానున్న‌ది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10