AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల

టీఎస్‌పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. ఆ దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు secy-ser-gad@telangana.gov.in మెయిల్‌కు పంపించవచ్చని పేర్కొంది. ఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలను ఈ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10