AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘అన్నపూరణి’ వివాదం.. తెలంగాణ ఎమ్మెల్యే సంచలన కామెంట్లు!

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన అన్నపూరణి సినిమా వివాదం ఇప్పుడు తెలంగాణను కూడా తాకింది. ఇప్పటికే ఈ చిత్రంపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కేసులు నమోదు కాగా.. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ తొలగించింది కూడా. తాజాగా ఈ సినిమా వివాదంపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను జీ స్టూడియోస్‌ సంస్థ తెరకెక్కించగా.. ఆ సంస్థపై పూర్తిగా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సినిమాలు గతంలో కూడా వచ్చాయని.. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు రాకుండా దర్శకులు, నటీనటులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోమంత్రి అమిషాకు రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.

జీ స్టూడియోస్ క్షమాపణలు చెప్పిందని విన్నానని.. కానీ క్షమాపణలు చెప్పినా ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉంటాయని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చాలా సినిమాలు వచ్చాయని.. వాటి మీద స్పందించినా మళ్లీ అలాంటివి వస్తూనే ఉన్నాయన్నారు. ఈ వివాదానికి కారణమైన జీ స్టూడియోస్‌ను పూర్తిగా నిషేధించాలని.. ఇలాంటి సినిమాలు తీసే దర్శకులు, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నానంటూ రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు.

అయితే.. లేడీ సూపర్‌ స్టార్ నయనతార.. అన్నపూరణి చిత్రంలో ఓ బ్రాహ్మణ అమ్మాయిగా నటించింది. అయితే.. సినిమాలో ఒక చోట రాముడు మాసం తిన్నట్టుగా చెప్పటం, మరో చోట బ్రహ్మణ అమ్మాయి అయిన హీరోయిన్ నమాజ్ చేయటం లాంటి సీన్లపై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తమవుతోంది. దీనిపై.. ఇప్పటికే మహారాష్ట్రలో మాజీ శివసేన లీడర్ రమేశ్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్‌లోనూ ఈ సినిమాపై కేసు నమోదైంది. ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతియడమే కాకుండా.. లవ్‌ జీహాద్‌ను ప్రొత్సహించేలా ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. రోజురోజుకు ఈ వివాదం పెద్దదవుతుండటంతో.. సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుంచి పూర్తిగా తొలగించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10