టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu) అభిమానులు ప్రస్తుతం గుంటూరు కారం (Guntur kaaram) సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నేడు గ్రాండ్‌గా విడుదలైన సందర్భంగా థియేటర్ల దగ్గర అభిమానులు డ్యాన్సులు, కేకలతో హోరెత్తించారు. కాగా ఓ వైపు మూవీ లవర్స్ అంతా థియేటర్లలో ఎంజాయ్ చేస్తుండగా.. మరోవైపు మహేశ్ బాబు ఇవాళ హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో కుటుంబసభ్యులు, దర్శకుడు వంశీ పైడిపల్లి అండ్ గుంటూరు కారం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ చిత్రయూనిట్‌తో కలిసి స్పెషల్ షో వీక్షించాడు.
ఈ సందర్బంగా థియేటర్ పరిసర ప్రాంతాలు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఈ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన గుంటూరు కారంతో సూపర్ స్టార్ అభిమానులకు పర్‌ఫెక్ట్ సంక్రాంతి కానుక ఇచ్చినట్టైందంటున్నారు సినీ జనాలు. మహేశ్ నుంచి అభిమానులు ఆశిస్తున్న అన్ని ఎలిమెంట్స్‌తో సినిమా సాగుతుందని ఇప్పటివరకు వచ్చిన రివ్వ్యూస్ చెబుతున్నాయి.
గుంటూరు కారం శాటిలైట్ రైట్స్‌ను జెమినీ టీవీ దక్కించుకోగా.. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుంది. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన మేకింగ్ వీడియో, మేకింగ్ స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. సెట్స్‌లో మీనాక్షి చౌదరి, శ్రీలీల, మహేశ్ బాబు, త్రివిక్రమ్ అండ్ ప్రొడ్యూసర్స్ టీం సరదా క్షణాలకు సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో ఎస్ థమన్ ఊరమాస్ కంపోజిషన్‌లో శ్రీలీల, మహేశ్ బాబు కాంబోలో వచ్చే హై ఓల్టేజ్ స్పైసీ హాట్ మాస్ కుర్చీని మడతపెట్టి సాంగ్ థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.