AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టైటానిక్ ఇప్పుడు మునిగిపోయి ఉంటే…!: ఆనంద్ మహీంద్రా ట్వీట్

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పంచుకున్నారు. టైటానిక్ నౌక మునిగిపోతుండగా, నీళ్లలో పడిపోయిన ప్రయాణికులు ఆ నౌక మునిగిపోతుండడాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న ఫొటోను ఆయన పంచుకున్నారు.

“టైటానిక్ నౌక ఇప్పుడు మునిగిపోయి ఉంటేనా… అనే ఈ మీమ్ మొదటిసారిగా 2015లో తెరపైకి వచ్చింది. అప్పటికి ఇప్పటికి ప్రజల ఆలోచనా ధోరణిలో ఏ మార్పు లేదు. రోజులు గడిచేకొద్దీ ఆ మీమ్ ఇప్పటివాళ్ల ఆలోచనా విధానానికి మరింత దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోంది” అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

సమాజంలో ఏదైనా ఘటన జరిగితే దాన్ని మొబైల్ లో చిత్రీకరించే ధోరణి ప్రబలిపోతుండడం పట్ల సెటైరికల్ గా ఈ మీమ్ ను అప్పట్లో రూపొందించారు. దాన్నే ఇప్పుడు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10