ప్రముఖ తెలుగు సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కమలం పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ టిక్కెట్ ఆశించి భంగపడిన విక్రమ్ గౌడ్ రాజీనామా చేశారు. తాజాగా జయసుధ కూడా అదే దారిలో నడిచారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. జయసుధ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయసుధ గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ ఆ పార్టీ మేకల సారంగపాణికి టిక్కెట్‌ను కేటాయించింది.