AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాకోద్దు బాబోయ్ ఈ జీవ‌న్ రెడ్డి .. నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి తీరుపై అసమ్మతి గళం..

పార్లమెంట్ ఎన్నికలలోపు మార్చాలని అల్టిమేటం!
నిజామాబాద్‌ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మాకోద్దు బాబోయ్‌ అంటున్నారట కేడర్‌.. అసలు కేడర్‌ను పట్టించుకోని లీడర్‌ మాకేందుకు అంటున్నారట. పార్టీ ఓడినా కనీసం రివ్యూ కూడా చేయని జిల్లా అధ్యక్షుడు ఎందుకు అంటూ కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారట. అసలు పార్టీని పట్టించుకోకుండా, జిల్లాను పట్టించుకోకుండా ఉన్న జిల్లా అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా హైకమాండ్‌కే ఫిర్యాదులు కూడా చేస్తున్నారట.

నిజామాబాద్‌ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డిపై పార్టీ జిల్లా కేడర్‌ గుర్రుగా ఉందట. కనీసం జిల్లా అద్యక్షుడిగా తన బాధ్యతను నెరవేర్చలేదని ఫైర్‌ అవుతున్నారట. జిల్లాలో పార్టీ ఓటమి పాలైనా ఇప్పటి వరకు కనీసం సమీక్ష నిర్వహించలేదని మండిపడుతున్నారట. ఈ జిల్లా అధ్యక్షుడు మాకోద్దు బాబోయ్‌ అంటూ ఏకంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావుకే మొర పెట్టుకున్నారట నిజామాబాద్‌ జిల్లా నేతలు. అటు మాజీ ఎమ్మెల్యేలు సైతం జీవన్‌ రెడ్డితో తలనొప్పిగా ఉందంటూ యాక్టివ్‌గా ఉన్న వాళ్లకు జిల్లా బాధ్యతలు అప్పగిస్తే, కనీసం పార్లమెంట్‌ ఎన్నికల్లో కొంత సానుకూలత ఏర్పడుతుందని అశాభావం వ్యక్తం చేశారట.

ఇక నిజామాబాద్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఘోర ఓటమిని చవిచూసింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ కేవలం ఒక్క బాల్కొండలో మాత్రమే విజయం సాధించింది. అది కూడా పోటా పోటీగా సాగిన ఎన్నికల్లో మూడు వేల ఓట్ల మోజారిటీతో గెలిచింది. ఇంత ఘోర ఓటమి తర్వాత కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జీవన్‌ రెడ్డి కనీసం పార్టీని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు. పార్టీని వదిలేసి వ్యాపారాలపై పడ్డారని ఘాటు వాఖ్యలు చేస్తున్నారు. ఇక పార్టీ నష్టానికి జీవన్‌ రెడ్డి వ్యవహర శైలి, మాట తీరు కారణం అనే ప్రచారం జరుగుతుంది. ఏకంగా సొంత పార్టీ నుండి పోటి చేసి ఓడిపోయిన నాయకులు బహిరంగా విమర్శలు చేస్తున్నారు.

ఇక అటు ఆర్మూరు ఇన్‌చార్జిగా కూడా జీవన్‌ రెడ్డిని మార్చాలనే డిమాండ్‌ పెరుగుతుంది. ఇప్పటికే మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌పై సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇప్పుడు జీవన్‌రెడ్డి వ్యవహర శైలిపై సొంత పార్టీ నేతలే పైర్‌ అవుతున్నారు. పార్లమెంట్‌ సన్నాహక సమావేశంలో కూడా జీవన్‌ రెడ్డి తీరుపై బహిరంగగా విమర్శించారట నేతలు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వాఖ్యలు కూడా జీవన్‌ రెడ్డిని ఉద్దేశించి చేసినవే అనే ప్రచారం జరుగుతుంది. తనను కలవనీయకుండా కొంత మంది నేతలను, కేడర్‌ను కట్టడి చేశారని జీవన్‌ రెడ్డిని ఉద్దేశించే అన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.

మొత్తం మీద జీవన్‌ రెడ్డి అధ్యక్ష స్థానం నుండి మార్చకపోతే తాము పార్టీని వీడక తప్పేలా లేదు అంటున్నారట కేడర్‌. పార్లమెంట్‌ ఎన్నికలకకు ముందే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఏకంగా హైకమాండ్‌ కు అల్టిమేటం ఇచ్చారట.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10