ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. మోదీతో అరగంటకు పైగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు రావాల్సిన నిధులు, బకాయిలు విడుదల చేయాలని సీఎం, డిప్యూటీ సీఎం ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. విభజన సమస్యలతో పాటు, పెండింగ్ ప్రాజెక్టులు వాటి అనుమతులపై కూడా చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని తొలిసారిగా కలిశారు.