బాలీవుడ్ కలర్ఫుల్ కపుల్ రణ్బీర్ కపూర్-అలియా భట్ దంపతులు దాదాపు ఏడాదిన్నర తర్వాత తొలిసారి తమ గారాలపట్టి ‘రహా’ని బయట ప్రపంచానికి పరిచయం చేశారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తమ అందాల కూతురిని సోమవారం మీడియా ముందుకు తీసుకొచ్చారు. తెల్లటి గౌనులో చిన్నారి ‘రహా’ మెరిసిపోయింది. పాల బుగ్గలతో ముద్దు ముద్దుగా కనిపించింది. అమాయకంగా అటుఇటు చూస్తూ అమ్మానాన్నలతో కలిసి తొలిసారి కెమెరాల కళ్లకు చిక్కింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కాగా రణ్బీర్ కపూర్ – అలియా భట్ గతేడాది ఏప్రిల్ 14న వివాహబంధం ద్వారా ఒక్కటయ్యారు. గతేడాది నవంబర్ 6న ‘రహా’కు జన్మనిచ్చింది. అయితే దాదాపు ఏడాదిన్నరపాటు పాపను బయట ప్రపంచానికి చూపించలేదు. ఫొటోలు, వీడియోలను షేర్ చేయలేదు. తొలిసారి సోమవారమే విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పాప ముద్దుగా ఉందని, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.