తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన తాజా బులిటెన్‌లో తెలిపింది. ఇప్పటివరకూ మొత్తం నమోదైన కేసుల సంఖ్య 8,44,558కి చేరింది. కొత్తగా ఒకరు రికవరీ అయ్యారు. అందువల్ల మొత్తం రికవరీ కేసుల సంఖ్య 8,40,392కి చేరింది. కొత్తగా ఎవరూ చనిపోలేదు. మొత్తం మరణాల సంఖ్య 4111గా ఉంది.
తెలంగాణలో రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 55 ఉన్నాయి. ఐతే.. తెలంగాణలో కొత్త కరోనా JN.1 వేరియంట్ కేసులు 2 ఉన్నాయని తెలిసింది.