తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన ఇంటికి వచ్చిన చిరంజీవిని రేవంత్ ఆప్యాయంగా ఆహ్వానించారు. వీరిద్దరూ కాసేపు పలు విషయాలపై మాట్లాదుకున్నారు. రేవంత్ పేరును సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన వెంటనే… అందరికంటే ముందుగా ఆయనను చిరంజీవి అభినందించారు. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.
రేవంత్ ను కలిసేందుకు సినీ ప్రముఖులు ఇప్పటికే అపాయింట్ మెంట్ కోరారు. త్వరలోనే మనం కలుద్దామని వారికి రేవంత్ చెప్పారు. ఈలోపే రేవంత్ ను చిరంజీవి వ్యక్తిగతంగా కలిశారు. మరోవైపు, రేవంత్, చిరంజీవి భేటీ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను రేవంత్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మర్యాదపూర్వకంగా చిరంజీవి గారిని కలవడం జరిగిందని రేవంత్ అన్నారు.