హైదరాబాద్ నగర పరిధిలో ఓ పోలీస్ అధికారి అదృశ్యం అయ్యారు. మాదాపూర్ సబ్ ఇన్స్‌పెక్టర్ రాజేశ్వర్ రెడ్డి సోమవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. క్రిస్మస్ పండుగ బందోబస్తు డ్యూటీ వేశారని ఇంట్లో భార్యకు చెప్పి ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం సమయంలో భార్య ఫోన్‌కు `నువ్వూ పిల్లలు జాగ్రత్త` అని మెసేజ్ పెట్టిన తర్వాత ఎవరికీ అందుబాటులోకి రాలేదు.
ఈ విషయమై ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి భార్య.. మాదాపూర్ పోలీసులను సంప్రదించినట్లు తెలుస్తున్నది. దీంతో అప్రమత్తమైన మాదాపూర్ పోలీసులు తమ ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. పోలీసు ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక రాజేశ్వర్ రెడ్డి కనిపించకుండా వెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.