కనీసం తన తండ్రిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పేర్కొన్నారు. నేడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో బండి సంజయ్ కొడుకు సాయిభగీరథ్ మాట్లాడుతూ.. తన తండ్రి హార్ట్ పేషెంట్‌అని పేర్కొన్నారు. ఆయన గురించి ఏం సమాచారం లేదని తెలిపారు. అరెస్ట్ సమయంలో తన తండ్రికి గాయాలయ్యాయని తెలిపారు. అరెస్ట్ సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని సాయిభగీరథ్ వెల్లడించారు.
ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదు..
బండి సంజయ్ అరెస్ట్‌పై ఆయన సతీమణి అపర్ణ సైతం స్పందించిన విషయం తెలిసిందే. అసలేం జరిగిందనేది ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. ఆయనను కనీసం టాబ్లెట్స్ కూడా వేసుకొనివ్వలేదని అపర్ణ పేర్కొన్నారు. పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదన్నారు. బండి సంజయ్ అరెస్ట్ లకు భయపడరని తేల్చి చెప్పారు. తన తల్లి చిన్న కర్మలో సంజయ్ పాల్గొనకుండా చేశారన్నారు. అల్లుడు, కూతురు చేయాల్సిన కార్యక్రమాన్ని సైతం అడ్డుకున్నారన్నారు. పోలీసులను చాలా వేడుకున్నప్పటికీ వినలేదని అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు.