AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టులో బిగ్ రిలీఫ్

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పబ్లిక్ న్యూసెన్స్ కేసులో అరెస్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో ఊరట దక్కింది. పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడికి సైతం బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసులో అరెస్ట్ అయిన మొదటి నలుగురు ముద్దాయిలకు (ఏ-1 నుండి ఏ-4) బెయిల్ లభించింది. పల్లవి ప్రశాంత్ ఎక్కడా కూడా సమావేశాలు నిర్వహించకూడదని, మీడియాతో మాట్లాడకూడదని నాంపల్లి కోర్టు ఆదేశించింది. అంతేకాదు ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది నాంపల్లి కోర్టు. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో పల్లవి ప్రశాంత్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ప్రశాంత్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు. బిగ్ బాస్ ఫైనల్ తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు విధ్వంసానికి పాల్పడ్డారని.. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు ధ్వంసం చేశారని పోలీసులు కేసులు నమోదు చేశారు. అభిమానులు రెచ్చిపోవడానికి ప్రశాంతే కారణం అంటూ అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇక, పల్లవి ప్రశాంత్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పోలీసుల విధులకు ప్రశాంత్ ఆటంకం కలిగించాడని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ప్రశాంత్ కారణంగానే యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. పల్లవి ప్రశాంత్ అతడి అనుచరులను రెచ్చగొట్టడంతో వాహనాలు ధ్వంసం చేశారని అన్నారు.

పల్లవి ప్రశాంత్ కారణంగానే దాదాపు 8 ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి, పలువురు గాయపడ్డారు అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉండేందుకు భయం ఉండాలనే ఉద్దేశంతోనే పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశామన్నారు. పల్లవి ప్రశాంత్ బయటే ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందుకే అదుపులోకి తీసుకున్నామని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10