కరోనా మహమ్మారి (Corona) మరోసారి విజృంభిస్తోంది. గురువారం హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి ‘నీలోఫర్’లో 14 నెలల శిశు బాలుడికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. అయితే బాలుడి బాలుడి ఆరోగ్యం స్థిరంగానే ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషా రాణి వెల్లడించారు. డిసెంబర్ 18న న్యూమోనియాతో చిన్నారిని హాస్పిటల్‌లో చేర్పించారని, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించాయని ఆమె వివరించారు. అన్ని న్యూమోనియో కేసులకు కరోనా టెస్టులు చేస్తుంటామని, అదే విధంగా బాలుడికి కూడా నిర్వహించగా కొవిడ్ నిర్ధారణ అయ్యిందని చెప్పారు. బుధవారం శాంపుల్స్‌ను టెస్టింగ్‌కు పంపించగా గురువారం నిర్ణారణ అయ్యిందని వివరించారు. అయితే బాలుడి తల్లిదండ్రుల్లో కరోనా లక్షణాలులేవని పేర్కొన్నారు.