AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జ‌మ్మూ క‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడి.. ముగ్గురు జ‌వాన్లు మృతి

న్యూఢిల్లీ : జ‌మ్మూక‌శ్మీర్‌లో జ‌వాన్లు వెళ్తున్న ఆర్మీ ట్ర‌క్కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జ‌వాన్లు మృతి చెంద‌గా, మ‌రో ముగ్గురు జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఫూంచ్ జిల్లాలోని బూఫ్లియాజ్ ఏరియాలో ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్నార‌న్న ప‌క్కా స‌మాచారంతో నిన్న రాత్రి నుంచి బ‌ల‌గాలు ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్నాయి. ఈ క్ర‌మంలో సావ్నీ ఏరియాలోని రాజౌరీ – థ‌న‌మండి – సూర‌న్‌కోటే ర‌హ‌దారిపై గురువారం మ‌ధ్యాహ్నం 3:45 గంట‌ల‌కు ఆర్మీ ట్ర‌క్కుల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు.

నిన్న రాత్రి నుంచి బూఫ్లియాజ్ ఏరియాలో ఉగ్ర‌వాదుల కోసం వేట కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే అక్క‌డికి రెండు ఆర్మీ ట్ర‌క్కుల్లో బ‌ల‌గాల‌ను తీసుకెళ్తున్నారు. దీంతో ఆర్మీ ట్ర‌క్కుల‌ను గ‌మ‌నించిన ఉగ్ర‌వాదులు మెరుపుదాడి చేశారు. ఇక ఇరు వ‌ర్గాల మ‌ధ్య భీక‌ర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల‌తో అద‌న‌పు బ‌ల‌గాల‌ను ఆ ప్రాంతానికి పోలీసులు చేర్చారు. ఫూంచ్ జిల్లాలోని ఆర్మ్‌డ్ పోలీసు యూనిట్‌లోని కంపౌండ్‌లో నిన్న రాత్రి పేలుళ్లు సంభ‌వించాయి. వాహ‌నాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో అక్క‌డ ఉగ్ర‌వాదులు ఉన్నార‌న్న స‌మాచారం మేర‌కు ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10