ముఖ్యమంత్రి కేసీఆర్.. దమ్ముంటే నీ ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫకేట్ బయటపెట్టు అంటూ బీజేపీ రాష్ట అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాజాన్ని చదివి దేశాన్ని అగ్రపథంలోకి తీసుకెళుతుంటే… కేసీఆర్ కుటుంబం చదువుకున్న చదువును డ్రగ్స్, పత్తాలు, దొంగ సారా దందాకు ఉపయోగిస్తూ వేల కోట్లు దోచుకుంటోందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అంటే బీరు…రమ్… స్కాచ్ పార్టీ అని, కేసీఆర్ కుటుంబం మీరంతా అంతర్జాతీయ దొంగల ముఠాకు నాయకులని ఎద్దేవా చేశారు. 8 ఏళ్ల క్రితం ఇల్లు తప్ప ఏమీలేని కేసీఆర్ నేడు వేల కోట్లతో ప్రతిపక్ష పార్టీలకు డబ్బులిచ్చే స్థాయికి ఎట్లా ఎదిగారని ప్రశ్నించారు. ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో నిర్వహించబోయే సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ తదితురులతో కలిసి పరేడ్ మైదానానికి వచ్చిన బండి సంజయ్ ఈనెల 8న సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో ఉదయం 10.30 గంటలకు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయానికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు హాజరవుతారని వెల్లడిరచారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అందులోని ముఖ్యాంశాలు. ఆయన మాటల్లో..
` ఈనెల 8న వందేభారత్ రైలు ప్రారంభోత్సం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తున్నారు. ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చాం. ఈ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరుతున్నాం.
` కేసీఆర్ కుటుంబానికి ఏం పనిలేదు… కేసీఆర్, ఆయన కొడుకు, బిడ్డ బాగా చదువుకున్నారు కదా… దేనికి ఉపయోగపడిరది. డ్రగ్స్, పత్తాలు, దొంగ సారా దందాకు, కమీషన్లు తీసుకోవడానికే ఉపయోగపడిరది. చదువుకున్న అజ్ఞానులు మీరు…
` మోదీగారు సమాజాన్ని చదివిన వ్యక్తి. దేశాన్ని అభివ్రుద్ది బాటలోకి తీసుకెళ్తున్నారు. ప్రపంచంలోనే భారత్ ను 5 వ స్థానానికి తీసుకొచ్చారు.
` 80 వేల పుస్తకాలు చదువుకున్న మీ అయ్య చదువు ఏమైంది? ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ చదివినని మీ అయ్య చెప్పిండు…. నీకు చేతనైతే ముందు ఆ సర్టిఫికేట్ ను బయట పెట్టు. దొంగ పాస్ పోర్ట్, దొంగ సర్టిఫికెట్స్ తయారు చేయడంలో మాస్టర్ డిగ్రీ చేసినట్లున్నడు.
` మిగులు రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాల్జేసిండు.. బీఆర్‌ఎస్ అంటేనే అంతర్జాతీయ దొంగల ముఠా. స్కీంల ద్వారా ఏ విధంగా స్కాంలు చేయాలో ట్రైనింగ్ ఇచ్చే సంస్థ బీఆర్‌ఎస్ భవన్. బీఆర్‌ఎస్ అంటేనే బీరు, రమ్ము, స్కాచ్ పార్టీ…
` కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏంది?…టిఆర్‌ఎస్ ను బీఆర్‌ఎస్ చేయడమా? కొడుకును, అల్లుడును మినిస్టర్ చేయడమా? కూతురుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమా? ఆడవారిపై బీఆర్‌ఎస్ నాయకుల అఘాత్యాలే బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి. తెలంగాణ సొమ్మును దోచుకుని దాచుకోవడమే టిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి.
` టీఎస్పీఎస్సీ లీకేజీపై బాధ్యులను శిక్షించే వరకు బీజేపీ పోరాడుతుంది. అందులో భాగంగా త్వరలోనే వరంగల్ ఉమ్మడి జిల్లాలో వేలాది మందితో నిరుద్యోగ మార్చ్ నిర్వహించబోతున్నాం. మిగిలిన ఉమ్మడి జిల్లాలన్నింట్లోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం. అట్లాగే త్వరలోనే రాష్ట్ర రాజధానిలో లక్షలాది మందితో నిరుద్యోగ మార్చ్, బహిరంగ సభ నిర్వహిస్తాం.