హైదరాబాద్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజల కండలను పట్టిపీకేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో కొంత కాలంగా శునకాలు పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నాయి. వీధుల్లో ఒంటరిగా వెళ్తే చాలు వెంటపడి కరిచేస్తున్నాయి. దీంతో కుక్కలను చూస్తేనే జనం అమ్మో అని వణికిపోయే పరిస్థితి నెలకొంది. వీధిలో కుక్కలు కనిపిస్తే అటు వైపు వెళ్లడం మానేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో కుక్కల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన జీహెచ్ఎంసీ హైలెవల్ మీటింగ్ నిర్వహించింది.
వీధి కుక్కల నియంత్రణకు హై లెవెల్ కమిటీ ఇచ్చిన 26 అంశాలను నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేయడంపై జీహెచ్ఎంసీ ప్లాన్ రూపొందించనుంది. దీనికితోడు హైదరాబాద్లో పేరుకుపోతున్న చెత్త సమస్య పై చర్చించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, రాంకీ ప్రతినిధులు పాల్గొననున్నారు.