AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంత డబ్బు ఎలా సంపాదించారో చెప్పాలి : బండి సంజయ్

TSPSC, టెన్త్ పేపర్ లీకులపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో పరీక్ష పేపర్ల లీకుల జాతర నడుస్తోందని విమర్శించారు బండి సంజయ్. కేసీఆర్ పాలనలో అన్నీ లీకేజీలేనని.. ఏ ఒక్క పరీక్ష సక్రమంగా నిర్వహించిన దాఖలాలు లేవన్నారు బండి. వరస లీకులకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారాయన. మంత్రులు కేటీఆర్, సబితా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సంజయ్. తెలంగాణ రాకముందు కేసీఆర్ ఎట్లున్నడు.. ఇప్పుడు ఎట్లున్నడు.. ప్రతిపక్షాలకు పెట్టుబడి పెట్టే స్థాయికి కేసీఆర్ ఎలా ఎదిగారని ఆయన ప్రశ్నించారు. అంత డబ్బు కేసీఆర్ ఎలా సంపాదించారని ప్రశ్నించారాయన. చదువుకు, పదవులకు ఎలాంటి సంబంధం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సీఎం కేసీఆర్ MSC పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కవిత చదువుకుని లిక్కర్ స్కామ్ చేసిందని ఆరోపించారు. ఏప్రిల్ 8న హైదరాబాద్ లో ప్రధాని మోడీ పర్యటన ఉన్న క్రమంలో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పరేడ్ గ్రౌండ్ లను బీజేపీ నేతలతో కలిసి సంజయ్ పరిశీలించారు. ఏప్రిల్ 4వ తేదీ మంగళవారం మోడీ పర్యటన ప్రాంతాల్లో రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు అందరూ పరిశీలించారు. తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో దేశంలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని.. రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని.. కేసీఆర్ కు రాజకీయ సమాధి కడతారని జోస్యం చెప్పారు బండి సంజయ్.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10