తెలంగాణ కూల్‌రూఫ్ పాలసీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇళ్లు, వాణిజ్యభవనాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించేందుకు కూల్‌రూఫ్ ఉపయోగపడుతుంది. ఐదేళ్ల పాటు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. హైదరాబాద్ పరిధిలో 100 చదరపు కిలోమీటర్లు, రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కూల్‌రూఫ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇకపై నిర్మించే ప్రభుత్వ, వాణిజ్య భవనాలకు కూల్‌రూఫ్ ఉంటేనే అక్యూపెన్సి సర్టిఫికెట్ ఇస్తారు. అయితే కూల్‌రూఫ్ పాలసీ ఉద్దేశం, ఉపయోగాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే 100 శాతం అమలవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే భవిష్యత్ తరాల కోసం తెస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు.